ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్ముదామనుకున్న ఓ మహిళను మోసం చేశాడో సైబర్ నేరగాడు. కోటి రూపాయలకు కిడ్నీ కొంటానంటూ లక్షలు దోచేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు మూదలపాళ్యాకు చెందిన ఓ మహిళ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ చూసిందామె. కిడ్నీ దానం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆ యాడ్‌లో ఉంది. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడదామని భావించిన ఆమె కిడ్నీ దానం చేయటానికి నిర్ణయించుకుంది. యాడ్‌లో ఉన్న నెంబర్‌కు మెసేజ్ చేసింది. అనంతరం వారితో ఫోన్‌లో మాట్లాడగా.. హదాఫాంగ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి, చట్టబద్ధంగా కిడ్నీ దానం చేయాలంటే కిడ్నీ డోనర్ కార్డు ఉండాలని చెప్పాడు. ( బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం )
టాక్స్ ఐడెంటిఫికేషన్ ఫీజు, పోలీసు అనుమతులకోసం కొంత డబ్బు తన ఖాతాలో జమచేయాల్సిందిగా కోరాడు. సదరు మహిళ తన వద్ద ఉన్న నగలను కుదువ పెట్టి అతడు అడిగిన రూ.3 లక్షలు ఖాతాలో జమచేసింది. అయితే డబ్బు అతడి ఖాతాలో జమ అయిన తర్వాతి నుంచి స్పందించటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు అతడి ఖాతాలో డిపాజిట్ అయిన వెంటనే విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ( మరో మన్మథుడు.. మహిళలే టార్గెట్ )
Comments
Please login to add a commentAdd a comment