
మండ్య : తల్లి అస్థికలు నదిలో కలుపుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం శ్రీరంగపట్టణ సమీపంలోని గంజాం కావేరి నది సంగమంలో చోటు చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన శ్రీకాంత్(45) తల్లి మూడు రోజుల క్రితం మృతి చెందింది.దీంతో తల్లి అస్థికలను నదిలో నిమజ్జనం చేయడానికి గంజాం సమీపంలోని కావేరి నది సంగమానికి వచ్చాడు. ఈ క్రమంలో అస్థికలు నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రీకాంత్ కోసం గాలించగా శ్రీరంగపట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న మహదేవపుర సమీపంలోని ఓ చెక్‌డ్యామ్‌లో మృతదేహం లభించింది. శ్రీరంగపట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment