
యశవంతపుర : తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేయటం మానుకోవాలని కేజీఎఫ్ హీరో యశ్ మాధ్యమాలకు విన్నవించారు. ఓ కన్నడ నటుడిని హత్య చేయటానికి సుపారీ ఇచ్చినట్లు శనివారం వివిధ మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీంతో యశ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై ఎవరికి ద్వేషం లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరని యశ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై సీసీబీ అడిషనల్ కమిషనర్ అలోక్‌కుమార్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. హోం మంత్రి ఎంబీ పాటిల్‌తో కూడా మాట్లాడినట్లు యశ్ విలేకరులకు వివరించారు. తనపై సుపారీ ఇచ్చే పరిస్థితులు ఏ కళాకారులకు కన్నడ సినీ పరిశ్రమలో లేదని, అనవసరంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనను హత్య చేస్తానంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని యశ్ స్పష్టం చేశారు. ఇటీవల నటుడిని హత్య చేయటానికి ప్లాన్ వేసిన నలుగురు నిందితులను ఆరు నెలల క్రితం శేషాద్రిపురం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 7న ఏసీపీ బలరాజ్ నేతృత్వంలో సీసీబీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హత్యకు గురైన లక్ష్మణ శిష్యుడు స్లం భరత్ ఓ నటుడిని హత్య చేయటానికి సుపారి తీసుకున్నట్లు గతంలో ప్రచారం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment