
యశవంతపుర : ఓ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బుల్లితెర నటుడు తేజస్‌గౌడ అలియాస్ అభిగౌడను చిక్కబళ్లాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. తాను 2012లో చిక్కబళ్లాపురం సమీపంలోని ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా అభిగౌడ పరిచయమయ్యాడని, తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని, పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి అత్యాచారానికి పాల్ప పాల్పడిన్నట్లు నటి చిక్కబళ్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 డిసెంబర్‌లో మరోమారు వంచించి అత్యాచారానికి పాల్పడగా తాను గర్భం దాల్చానని, ఈ విషయాన్ని అభిగౌడ వద్ద ప్రస్తావిస్తే నీవు ఎవరితో సంబంధం పెట్టుకోన్నావో అంట గర్భశ్రా వం చేయించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇ ప్పుడు మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో వాలని ప్రయత్నాల్లో ఉన్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీ సులు అభిగౌడను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment