
కరోనా సంక్షోభం తర్వాత కార్పొరేట్ ప్రపంచం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దాదాపు ఏడాదిన్నరగా నియమకాలు చేపట్టిన సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ సంస్థ బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త తెలిపింది.
యాపిల్ సంస్థకు చెందిన డెవలపింగ్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది. దీంతో పాటు బెంగళూరులో కూడా యాపిల్‌కి కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (డేటా ప్లాట్‌ఫార్మ్) ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్లు యాపిల్ కెరీర్ పోర్టల్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు ఇప్పటికే ఇదే క్వాలిఫికేషన్ మీద వివిధ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉండి మార్పు కోరుకునేవారికి ఇదో సువర్ణ అవకాశం. దాదాపు ఏడాది తర్వాత తిరిగి యాపిల్‌లో ఫుల్, పార్ట్‌టైం ప్రతిపాదికన ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఎంపికైన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సెంటర్‌లలో పని చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment