job oppurtunities
-
బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! హైదరాబాద్ యాపిల్ క్యాంపస్‌లో జాబ్ ఆఫర్స్
కరోనా సంక్షోభం తర్వాత కార్పొరేట్ ప్రపంచం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దాదాపు ఏడాదిన్నరగా నియమకాలు చేపట్టిన సంస్థలు ఇప్పుడు ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ సంస్థ బీటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త తెలిపింది. యాపిల్ సంస్థకు చెందిన డెవలపింగ్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది. దీంతో పాటు బెంగళూరులో కూడా యాపిల్‌కి కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (డేటా ప్లాట్ఫార్మ్) ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్లు యాపిల్ కెరీర్ పోర్టల్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు ఇప్పటికే ఇదే క్వాలిఫికేషన్ మీద వివిధ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉండి మార్పు కోరుకునేవారికి ఇదో సువర్ణ అవకాశం. దాదాపు ఏడాది తర్వాత తిరిగి యాపిల్‌లో ఫుల్, పార్ట్‌టైం ప్రతిపాదికన ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఎంపికైన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
టీటీడీలో లెక్చరర్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిగ్రీ కళాశాలల్లో.. బోటనీ, కామర్స్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, హోమ్‌సైన్స్, మ్యాథ్స్, ఓరియంటల్ కల్చర్(సంస్కృతం), ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం (వ్యవకరణ), స్టాటిస్టిక్స్, తెలుగు విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిన లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మొత్తం ఖాళీలు 31. సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స డిగ్రీ ఉండాలి. యూజీసీ/ సీఎస్ఐఆర్ నెట్/ స్లెట్/ సెట్లో అర్హత సాధించాలి. వయసు 40 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 5. మరిన్ని వివరాలకు http://recruitment.tirumala.org/ చూడొచ్చు. రాజ్యసభలో వివిధ ఉద్యోగాలు రాజ్యసభ టెలివిజన్.. రెండేళ్ల కాలపరిమితికి కన్సల్టెంట్ యాంకర్ (ఇంగ్లిష్) - (ఖాళీలు- 3 ), సీనియర్ గెస్ట్ కోఆర్డినేటర్ (ఖాళీలు-1), సీనియర్ వీడియో లైబ్రేరియన్ (ఖాళీలు-1), యాంకర్ (ఇంగ్లిష్) (ఖాళీలు-2), గ్రాఫిక్ డిజైనర్ (ఖాళీలు-6), మేకప్ ఆర్టిస్ట్ (ఖాళీలు -6), ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-5), కెమెరా అసిస్టెంట్ (ఖాళీలు-10), వీడియో లైబ్రేరియన్ (ఖాళీలు-4), స్టూడియో అసిస్టెంట్ (ఖాళీలు-7) పోస్టుల భర్తీకి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 6 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://rajyasabha.nic.in చూడొచ్చు. ఐఐటీ- ఖరగ్‌పూర్‌లో జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్... జూనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-3), సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-4), ప్రోగ్రామర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను ‘అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్), స్పాన్సర్‌డ రీసెర్చ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ, ఐఐటీ-ఖరగ్‌పూర్-721302కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 11. మరిన్ని వివరాలకు www.iitkgp.ac.in చూడొచ్చు. సీఎంఈఆర్ఐలో సైంటిస్ట్ / సీనియర్ సైంటిస్టులు సీఎస్ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 19. సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్టులకు 37 ఏళ్లు మించరాదు. నిర్దేశిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులు సైంటిస్ట్ పోస్టులకు; ఎంఈ/ఎంటెక్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. మరిన్ని వివరాలకు www.cmeri.res.in చూడొచ్చు. ఐఐటీ - రూర్కీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కీ.. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 14. సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండి బోధనలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. మరిన్ని వివరాలకు http://faculty.iitr.ernet.in/ చూడొచ్చు. ఐటీబీపీలో సబ్ ఇన్స్పెక్టర్స్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స (ఐటీబీపీ).. ఇన్స్పెక్టర్ (హిందీ ట్రాన్సలేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. హిందీలో మాస్టర్స డిగ్రీ ఉండి ఇంగ్లిష్ ఒక అంశంగా ఉండాలి/హిందీ, ఇంగ్లిష్తో బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌కు, ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాద విభాగంలో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 23. మరిన్ని వివరాలకు http://itbpolice.nic.in చూడొచ్చు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్స్ సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. అసిస్టెంట్ (జనరల్) గ్రేడ్-3 (ఖాళీలు-9), అసిస్టెంట్ (స్టోర్స్, పర్చేజ్) గ్రేడ్-3 (ఖాళీలు-2), అసిస్టెంట్ (ఫైనాన్స్, అకౌంట్స్) గ్రేడ్-3 (ఖాళీలు-3) విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 26. మరిన్ని వివరాలకు www.crridom.gov.in చూడొచ్చు. -
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1), మెంబర్ టెక్నికల్ సపోర్ట స్టాఫ్(ఖాళీలు-4), అసిస్టెంట్(ఖాళీలు-8). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in ఎన్ఎస్సీఎల్లో ట్రెయినీలు నేషనల్ సీడ్స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్సీఎల్)... డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.indiaseeds.com చూడొచ్చు. హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు. జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్ గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15. వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://gdch.goa.gov.in చూడొచ్చు. ఎన్ఎండీసీలో మేనేజర్లు హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు. ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్ప్స్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జూలై 9, 2016. మరిన్ని వివరాలకు http://joinindianarmy.nic.in చూడొచ్చు.