టీటీడీలో లెక్చరర్లు | lecturer posts in TTD | Sakshi
Sakshi News home page

టీటీడీలో లెక్చరర్లు

Published Tue, Sep 29 2015 8:20 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

టీటీడీలో లెక్చరర్లు - Sakshi

టీటీడీలో లెక్చరర్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిగ్రీ  కళాశాలల్లో.. బోటనీ, కామర్స్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, హోమ్‌సైన్స్, మ్యాథ్స్, ఓరియంటల్ కల్చర్(సంస్కృతం), ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం (వ్యవకరణ), స్టాటిస్టిక్స్, తెలుగు విభాగాల్లో  కాంట్రాక్టు పద్ధతిన లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మొత్తం ఖాళీలు 31. సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్‌‌స డిగ్రీ ఉండాలి. యూజీసీ/ సీఎస్‌ఐఆర్ నెట్/ స్లెట్/ సెట్‌లో అర్హత సాధించాలి. వయసు 40 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను  ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 5. మరిన్ని వివరాలకు http://recruitment.tirumala.org/ చూడొచ్చు.

రాజ్యసభలో వివిధ ఉద్యోగాలు
రాజ్యసభ టెలివిజన్.. రెండేళ్ల కాలపరిమితికి కన్సల్టెంట్ యాంకర్ (ఇంగ్లిష్) - (ఖాళీలు- 3 ), సీనియర్ గెస్ట్ కోఆర్డినేటర్ (ఖాళీలు-1), సీనియర్ వీడియో లైబ్రేరియన్ (ఖాళీలు-1), యాంకర్ (ఇంగ్లిష్) (ఖాళీలు-2), గ్రాఫిక్ డిజైనర్ (ఖాళీలు-6), మేకప్ ఆర్టిస్ట్ (ఖాళీలు -6), ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-5), కెమెరా అసిస్టెంట్ (ఖాళీలు-10), వీడియో లైబ్రేరియన్ (ఖాళీలు-4), స్టూడియో అసిస్టెంట్ (ఖాళీలు-7) పోస్టుల భర్తీకి  అక్టోబర్ 7 నుంచి నవంబర్ 6 వరకు  ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://rajyasabha.nic.in చూడొచ్చు.

ఐఐటీ- ఖరగ్‌పూర్‌లో జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్... జూనియర్ రీసెర్‌‌చ ఫెలో (ఖాళీలు-3), సీనియర్ రీసెర్‌‌చ ఫెలో (ఖాళీలు-4), ప్రోగ్రామర్ (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను ‘అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్), స్పాన్సర్‌‌డ రీసెర్‌‌చ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ, ఐఐటీ-ఖరగ్‌పూర్-721302కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 11. మరిన్ని వివరాలకు www.iitkgp.ac.in చూడొచ్చు.

సీఎంఈఆర్‌ఐలో సైంటిస్ట్ / సీనియర్ సైంటిస్టులు
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) వివిధ విభాగాల్లో  సైంటిస్ట్/ సీనియర్ సైంటిస్ట్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 19.   సైంటిస్ట్ పోస్టులకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్టులకు 37 ఏళ్లు మించరాదు. నిర్దేశిత విభాగాల్లో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులు సైంటిస్ట్ పోస్టులకు; ఎంఈ/ఎంటెక్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. మరిన్ని వివరాలకు www.cmeri.res.in చూడొచ్చు.

ఐఐటీ - రూర్కీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కీ.. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 14. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండి బోధనలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. మరిన్ని వివరాలకు http://faculty.iitr.ernet.in/ చూడొచ్చు.

ఐటీబీపీలో సబ్ ఇన్‌స్పెక్టర్స్
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్‌‌స (ఐటీబీపీ).. ఇన్‌స్పెక్టర్ (హిందీ ట్రాన్‌‌సలేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. హిందీలో మాస్టర్‌‌స డిగ్రీ ఉండి ఇంగ్లిష్ ఒక అంశంగా ఉండాలి/హిందీ, ఇంగ్లిష్‌తో బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్‌కు, ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాద విభాగంలో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 23. మరిన్ని వివరాలకు http://itbpolice.nic.in చూడొచ్చు.

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్స్
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్..  అసిస్టెంట్ (జనరల్) గ్రేడ్-3 (ఖాళీలు-9),  అసిస్టెంట్ (స్టోర్స్, పర్చేజ్) గ్రేడ్-3 (ఖాళీలు-2), అసిస్టెంట్ (ఫైనాన్స్, అకౌంట్స్) గ్రేడ్-3 (ఖాళీలు-3) విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 26. మరిన్ని వివరాలకు www.crridom.gov.in చూడొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement