సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు | job oppurtunities in software technology parks of india | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు

Published Sun, Sep 27 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు..  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1),  మెంబర్ టెక్నికల్ సపోర్‌‌ట స్టాఫ్(ఖాళీలు-4),  అసిస్టెంట్(ఖాళీలు-8). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in

ఎన్‌ఎస్‌సీఎల్‌లో ట్రెయినీలు
నేషనల్ సీడ్‌‌స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీఎల్)...  డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్‌‌స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11.  సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి.  వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు  www.indiaseeds.com చూడొచ్చు.

హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు
హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు.

జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్
గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15.  వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://gdch.goa.gov.in చూడొచ్చు.

ఎన్‌ఎండీసీలో మేనేజర్లు
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్  మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు.

ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స్
ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్ప్స్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది జూలై 9, 2016.  మరిన్ని వివరాలకు http://joinindianarmy.nic.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement