Software Technology Parks of India
-
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్‌లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్‌లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
స్టార్టప్‌లపై అవగాహన పెరగాలి
పనాజీ: దేశీయంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మరింత అవగాహన పెరగాల్సి ఉందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో స్టార్టప్‌ల వైఫల్య రేటు క్రమంగా తగ్గుతోందని ఆయన చెప్పారు. ‘నేను అనేక ఇంజినీరింగ్ కాలేజీలను సందర్శిస్తుంటాను. వారికి స్టార్టప్‌లు, ఎస్టీపీఐ గురించి .. అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న విషయాలేవీ తెలియవు‘ అని అరవింద్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్టీపీఐ డైరెక్టర్లు వివిధ కాలేజీలను సందర్శిస్తూ అంకుర సంస్థలు, వాటికి నిధుల సమీకరణ తదితర అంశాల గురించి యువతకు వివరిస్తున్నారని తెలిపారు. దీంతో నెమ్మదిగా అవగాహన పెరుగుతోందని, అయితే దీన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదనలకు సంబంధించిన వివిధ దశల గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు 12వ తరగతిలోనే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని, వారు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని అరవింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. వైఫల్యమనేది అంతర్జాతీయంగా కూడా స్టార్టప్ వ్యవస్థలో అంతర్గత భాగమేనని, మనం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే వైఫల్యాలు కాస్త ఎక్కువ స్థాయిలోనే అనిపించవచ్చని ఆయన చెప్పారు. కానీ, భారత్‌లో విఫలమవుతున్న అంకుర సంస్థల సంఖ్య తగ్గుతోందని, పదింటిలో ఒకటిగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన వివరించారు. -
ఎస్టీపీఐ సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం: పల్సస్
సాక్షి, విశాఖపట్నం: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సహకారంతో విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పల్సస్ గ్రూప్ తెలియజేసింది. పల్సస్ హెల్త్టెక్కు హైదరాబాద్‌తో పాటు చెన్నై, విశాఖ, గుర్గావ్లో కేంద్రాలున్నాయి. విశాఖలో డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి నైపుణ్యాలను అభివృద్ధి పరిచే శిక్షణ ఇవ్వటానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ‘‘డిజిటల్ మార్కెటింగ్‌తో ఆన్లైన్లోనే వినియోగదారుల దగ్గరకు వస్తువులు వెళుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలో ఉన్నవారికి ఇక్కడి నుంచే మనం ఉత్పత్తిని ప్రజెంట్ చేయొచ్చు. మా సంస్థ ఇప్పటికే 50కి పైగా దేశాల్లో మెడికల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తోంది. మా ఓపెన్ యాక్సెస్ హెల్త్ జర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులకు, వర్సిటీ విద్యార్థులకు అందుతున్నాయి. వీటి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం. అందుకే విశాఖ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. శిక్షణ పొందిన వారిలో చాలామందికి మేమే ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖలో దశల వారీగా 25 వేల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళిక వేస్తున్నాం. రాబోయే పదేళ్లలో ఐటీని మించి ఉద్యోగాలు కల్పించే స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే ఉంది’’ అని పల్సస్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు గేదెల చెప్పారు. సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలియజేశారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎం.ఫార్మా కోర్సులు చేసినవారు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రాణించడానికి అవకాశం ఉందన్నారు. -
అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్
రూ.67.7 కోట్ల {పాజెక్టుపై కన్ను అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ఎత్తుగడ డిజైన్‌పై కొర్రీలతో అడ్డుపుల్ల విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)’ విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించేందుకు మూడేళ్ల క్రితం ముందుకువచ్చింది. అప్పట్లోనే కేంద్రం రూ.16 కోట్లు విడుదల చేసింది. కానీ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో చక్రం తిప్పిన ఓ నేత ఈ ప్రాజెక్టు అంతా తన కనుసన్నల్లోనే సాగాలని పట్టుబట్టారు. అందుకు ఎస్టీపీఐ సమ్మతించకపోవడంతో ఆ ప్రాజెక్టు మూడేళ్లపాటు మూలనపడిపోయింది. ఏడాది క్రితం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం అంశాన్ని ఎస్టీపీఐ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా రూ.62.70 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. తన వాటాగా రూ.16.70 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు వుడా సమ్మతించింది. ఎస్టీపీఐ రూ.44 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తుంది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటన సందర్భంగా ఎస్టీపీఐ, వుడా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. 8 ఫ్లోర్లతో 62 వేల చ.అడుగుల వైశాల్యంతో కనీసం 50 ఐటీ యూనిట్లు నెలకొల్పే సామర్థ్యంతో నిర్మించేందుకు డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనీసం 2,500మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించారు. ఏటా రూ.300 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించవచ్చని అంచనా వేశారు. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. అందుకు త్వరలో టెండర్లు పిలవడానికి సంసిద్ధమయ్యారు. అమాత్యుడి అడ్డుచక్రం ఇంతటి విలువైన ప్రాజెక్టు పూర్తిగా ఎస్టీపీఐ పర్యవేక్షణలోనే సాగడం జిల్లాకు చెందిన ఓ అమాత్యుడికి ఏ మాత్రం రుచించలేదు. ఆ భారీ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆ తరువాత సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలన్నది పన్నాగం. తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండరు నిబంధనలు రూపొందించాలని భావించారు. కొన్నిరోజుల క్రితం వుడా అధికారులను పిలిపించి ప్రాజెక్టు డిజైన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. కాబట్టి మరో డిజైన్‌ను రూపొందించి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. వాస్తవానికి ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయ ఉన్నతాధికారి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్టీపీఐ వర్గాలు చెబుతున్నాయి. వారు ఆమోదించిన తరువాతే టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేపట్టామని తెలిపాయి. కానీ అమాత్యుడు ఆ డిజైన్‌ను సీఎం కార్యాలయం తిరస్కరించినట్లు చెబుతుండటంపై ఎస్టీపీఐ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అమాత్యుడి అభ్యంతరాల వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. డిజైన్‌పై అభ్యంతరాల నెపంతో మొత్తం టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలన్నది ఆయన వ్యూహం. టెండరు నిబంధనలు తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా రూపొందించేవరకు ఈ వ్యవహారాన్ని ఆయన ముందుకు సాగనివ్వరని స్పష్టమవుతోంది. కాగా తమ నిబంధనల మేరకే వ్యవహరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గేది లేదని ఎస్టీపీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమాత్యుడి కమీషన్ల వ్యవహారంతో విలువైన ప్రాజెక్టు మరోసారి పెండింగులో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్... రూ.67.70 కోట్ల ప్రాజెక్టు... 2,500 ఐటీ ఉద్యోగాలు లక్ష్యం... రూ.300 కోట్ల ఐటీ ఎగుమతుల అంచనా... అయితే... నా కేంటి?...‘నా సంగతి’ తేలేవరకు పనులు మొదలు పెట్టొద్దు. అసలు మీ డిజైనే బాగా లేదు. కొత్త డిజైన్‌తో రండి... ఇదీ ఓ అమాత్యుడి హుకుం... విశాఖను ఐటీ హబ్‌గా చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి అమ్యామ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రం నిధులిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తిపడుతూ మోకాలడ్డుతున్నారు. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ ప్రాజెక్టే అందుకు తాజా తార్కాణం. -
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1), మెంబర్ టెక్నికల్ సపోర్ట స్టాఫ్(ఖాళీలు-4), అసిస్టెంట్(ఖాళీలు-8). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in ఎన్ఎస్సీఎల్లో ట్రెయినీలు నేషనల్ సీడ్స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్సీఎల్)... డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.indiaseeds.com చూడొచ్చు. హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు. జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్ గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15. వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://gdch.goa.gov.in చూడొచ్చు. ఎన్ఎండీసీలో మేనేజర్లు హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు. ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్ప్స్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జూలై 9, 2016. మరిన్ని వివరాలకు http://joinindianarmy.nic.in చూడొచ్చు. -
తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు!
హైదరాబాద్: 2013-14 సంవత్సరానికి తెలంగాణ ప్రాంతంలో 57 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయని ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ అధికారికంగా వెల్లడించింది. 2012-13 సంవత్సరానికి సాఫ్ట్ వేర్ ఎగుమతుల విలువ 49,631 కోట్లు అని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. సాఫ్ట్ వేర్ ఎగుమతుల నేపథ్యంలో 3,23,691 ప్రత్యక్ష ఉద్యోగాల్ని కల్పించినటట్టు ఐటీ విభాగం తన నివేదికలో పేర్కొన్నారు. ఈ గణాంకాలను సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూపొందించాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో 14 శాతం వృద్దిని సాధించిందని నివేదికలో తెలిపారు.