తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు!
తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు!
Published Fri, Jul 4 2014 8:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
హైదరాబాద్: 2013-14 సంవత్సరానికి తెలంగాణ ప్రాంతంలో 57 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయని ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ అధికారికంగా వెల్లడించింది. 2012-13 సంవత్సరానికి సాఫ్ట్ వేర్ ఎగుమతుల విలువ 49,631 కోట్లు అని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.
సాఫ్ట్ వేర్ ఎగుమతుల నేపథ్యంలో 3,23,691 ప్రత్యక్ష ఉద్యోగాల్ని కల్పించినటట్టు ఐటీ విభాగం తన నివేదికలో పేర్కొన్నారు. ఈ గణాంకాలను సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూపొందించాయి.
ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో 14 శాతం వృద్దిని సాధించిందని నివేదికలో తెలిపారు.
Advertisement
Advertisement