Software exports
-
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్‌కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్‌ది మొదటి స్థానం. -
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
భారత సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.4.21లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత మూడు దశాబ్దాల్లో భారత సాఫ్ట్వేర్ ఎగుమతులను రూ.4.21 లక్షల కోట్ల కు చేర్చి దేశ ఆర్థిక పురోగతికి సా ఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇం డియా (ఎస్టీపీఐ) ఎనలేని కృషి చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్ రాయ్ అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఎస్టీపీఐ 29వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ సంస్థల భాగస్వామ్యం తో దేశవ్యాప్తంగా ఎస్టీపీఐ 21 నైపుణ్యాభివృద్ధి కేం ద్రాలు (సీఓఈ) ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటి ద్వారా దేశ వ్యాప్తంగా స్టార్టప్ వాతావరణానికి ఊతం లభిస్తుందన్నారు. వెబినార్ సదస్సు వేదికగా! ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థ లు, ఐటీ సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సును ప్రారంభించిన కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడు తూ.. ఐటీ రంగం అభివృద్ధిలో ఎస్టీపీఐ పాత్ర మరువలేనిదన్నారు. ఎస్టీపీఐ ఇటీవలి కాలంలో ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా బీపీఓ రంగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని తె లిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘సాఫ్ట్వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం’లో భాగంగా ఐ ఓటి, బ్లాక్ చెయిన్, ఏఐటీ, ఏఆర్, వీఆర్, ఫిన్‌టెక్, మె డికల్ ఎలక్ట్రానిక్స్, గేమింగ్ యానిమేషన్, మెషీన్ లె ర్నింగ్, డేటా సైన్స్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, చి ప్ డిజైనింగ్ వంటి నూతన ఐటీ సాంకేతికతను దృ ష్టిలో పెట్టుకుని ఎస్టీపీఐ ప్రణాళికలు సిద్దం చే స్తోందన్నారు. ఐటీ పరిశ్రమలో ఎస్టీపీఐ అంతర్భాగంగా మారిందని నాస్కామ్ అధ్యక్షుడు దేవయాని ఘోష్ అన్నారు. ఎస్టీపీఐ వద్ద నమోదైన 18వేలకు పైగా ఐటీ కంపెనీల ద్వారా 40.36 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. జీడీపీలో ఐటీ రంగం వాటా 8 శాతం కాగా, సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారత్ కేంద్రంగా మారుతోందన్నారు. -
భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యతో పాటు ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. పైగా తానే వారిని చంపినట్టు ఓ వీడియో చిత్రీకరించి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ (34) గత డిసెంబర్లో ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించలేక భార్య అన్షు బాలా(32), వారి ఐదేళ్ల కుమారుడు ప్రత్మేష్, కవలలు ఆరవ్, ఆకృతిలను ఆదివారం దారుణంగా చంపాడు. ఆత్మహత్య చేసుకోవడానికి పోటాషియం సైనేడ్ కొనుగోలు చేసినట్లు వెల్లడించిన వీడియోను కుమారి సోదరి చూసి ఇందిరాపురంలోనే ఉండే తమ బంధువు పంకజ్ సింగ్‌కు సమాచారం అందించింది. దీంతో వెంటనే అతను అక్కడికి పరిగెత్తాడు. తాను అక్కడికి వెళ్లేసరికి ఇంటి తలుపు తాళం వేసి ఉందని, పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చి తలుపులు పగలగొట్టారాని పంకజ్ సింగ్ తెలిపారు. లోపలికి వెళ్లి చూస్తే.. తన సోదరి, ముగ్గురు చిన్నారులు కత్తిపోట్లతో అక్కడ పడి ఉన్నారన్నారు. అన్షు బాలాకు కుమార్‌తో 2011లో వివాహం జరిగిందని, స్థానికంగా ఓ ప్లే స్కూల్లో అన్షుబాలా టీచర్‌గా పనిచేస్తుందన్నారు. గతేడాది డిసెంబర్లో ఉద్యోగం వదిలిపెట్టినప్పటి నుంచి కుమార్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, కుటుంబంతో పాటు తల్లిదండ్రులను కూడా అతనే పోషిస్తున్నాడని సింగ్ చెప్పుకొచ్చారు. ఈ వారం అతని తల్లిదండ్రులు బంధువుల పెళ్లి నిమిత్తం వేరే ఊరికి వెళ్లారని, ఫ్లాట్‌లో కుమార్‌తో పాటు అతని భార్యా, పిల్లలు మాత్రమే ఉన్నారని వారిని హత్య చేసి కుమార్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టమన్నారు. -
తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు!
హైదరాబాద్: 2013-14 సంవత్సరానికి తెలంగాణ ప్రాంతంలో 57 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయని ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ అధికారికంగా వెల్లడించింది. 2012-13 సంవత్సరానికి సాఫ్ట్ వేర్ ఎగుమతుల విలువ 49,631 కోట్లు అని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. సాఫ్ట్ వేర్ ఎగుమతుల నేపథ్యంలో 3,23,691 ప్రత్యక్ష ఉద్యోగాల్ని కల్పించినటట్టు ఐటీ విభాగం తన నివేదికలో పేర్కొన్నారు. ఈ గణాంకాలను సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూపొందించాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో 14 శాతం వృద్దిని సాధించిందని నివేదికలో తెలిపారు.