STPI
-
ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు. చదవండి: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ ఎస్టీపీఐ డైరెక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించబోతోందన్నారు. అరవింద్‌కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ఐటీ పాలసీ అద్భుతం ఐటీ సర్వీస్ సెక్టార్ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ వంటి టైర్–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే. బీపీవోల ఓటు వైజాగ్‌కే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్ ఎస్టీపీఐ లక్ష్యం ప్రస్తుతం ఎస్టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ సేవల మార్కెట్లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం. సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు ఇప్పటికే ఎస్టీపీఐ 20 సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల క్లస్టర్‌గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి. డేటా సెంటర్ హబ్‌గా భారత్ ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో డేటా సెంటర్ హబ్‌గా భారత్ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. -
Vizag: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: సాంకేతిక రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోందని, 130 కోట్ల మంది ప్రజలంతా టెక్నాలజీలో భాగస్వాములు కావడం విశేషమని మైక్రోసాఫ్ట్ ఇండియా క్లౌడ్ సైట్ లీడర్ చారుమతి శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘వైజాగ్ ది నెక్ట్స్ టెక్ హబ్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఎడ్యుటెక్, ఫార్మాటెక్ రంగాల్లో దూసుకెళ్లేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. స్టార్టప్ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందేందుకు ఇంక్యుబేటర్స్ ద్వా రా కార్యకలాపాలను పెంచడంతోపాటు ఫ్రెండ్లీ పాలసీ ద్వారా ప్రధానసంస్థల్ని ఆకర్షించాలని సూచించారు. 81 శాతం పరిశ్రమలకు ఆవిష్కరణలే బలమని చెప్పారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకం సదస్సు సందర్భంగా ఎస్టీపీఐ, ఎస్టీపీఐ నెక్టస్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నేతృత్వంలో ఇండస్ట్రీ 4.0 ద్వారా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా ఒప్పందం కుదిరింది. పరిశ్రమలతో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే వాతావరణాన్ని ఎస్టీపీఐ సృష్టిస్తుందని సదస్సును ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ సీవీడీ రామ్‌ప్రసాద్ తెలిపారు. విశాఖలో ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలిసి ఆవిష్కరణలు, అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ 4.0 ప్రారంభించామని చెప్పారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకమన్నారు. ఐటీ సెక్టార్‌తో విద్యుత్ రంగం కలిసి పనిచేస్తే వినియోగదారుల సమస్యలను మరింత త్వరగా పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని సీఐఐ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ తెలిపారు. స్టీల్‌ప్లాంట్, సెమ్స్, మారిటైమ్ యూనివర్సిటీ, ఎక్స్పోర్ట్ హబ్ లాంటి సంస్థలతో విశాఖ పారిశ్రామిక నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్‌గా ఎదిగే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. సీఐఐ వైస్ చైర్మన్ పీపీ లాల్‌కృష్ణ, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాకియ్యరా ఎస్టీపీఐలు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల (ఎస్టీపీఐ) కేటాయింపులో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇటీవల దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 22 ఎస్టీపీఐలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళకు దక్కాయని.. జాబితాలో తెలంగాణకు చోటు లేకపోవడం అన్యాయమన్నారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి శనివారం లేఖ రాశారు. రాష్ట్రానికి ఎస్టీపీఐల కేటాయింపు అంశాన్ని పునః పరిశీలించాలని.. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు ఎస్టీపీఐలను కేటాయించాలని కోరారు. ఐటీ పరిశ్రమలో రాణిస్తూ జాతీయ సగటును మించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం నుంచి 2014–15లో రూ.57,258 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని.. 2020–21లో రూ.1.45 లక్షల కోట్లకు ఎగుమతులు చేరాయని గుర్తు చేశారు. ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6.28 లక్షలకు చేరిందన్నారు. కమర్షియల్ ఆఫీసు స్పేస్ విషయంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందని, ఐటీ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, రూరల్ టెక్నాలజీ, డేటా సెంటర్ వంటి ప్రత్యేక పాలసీలు రూపొందించిందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం వసతులు కల్పిస్తోందన్నారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో అనేక సంస్థలు తమ కార్యకలాపాలు కూడా నెలకొల్పాయన్నారు. ఎస్టీపీఐల ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్టీపీఐల ఏర్పాటులో కేంద్రం అన్యాయం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్టీపీఐల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఐటీఐఆర్ రద్దుతో ఇప్పటికే స్థానిక యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, ఎస్టీపీఐల మంజూరులో వివక్షతో మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఐటీఐఆర్ హోదా పునరుద్ధరణకు సీఎం కేసీఆర్, ఎంపీల బృందంతో పాటు ఐటీ మంత్రి హోదాలో తాను ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. -
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల్లో రాష్ట్రానికి మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: చిన్న పట్టణాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఐటీ ఆధారిత సేవల పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న 22 ఎస్టీపీఐ పార్కులను మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించింది. కొత్త ఎస్టీపీఐలు ఏర్పాటయ్యే రాష్ట్రాల జాబితాలో ఒడిశా మినహా మిగతావన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. చిన్న పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పించడం ఎస్టీపీఐల లక్ష్యం. అయితే కొన్ని రాష్ట్రాలకే ఎస్టీపీఐలను కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. దేశంలోని 62 ఎస్టీపీఐలను పది రీజియన్లుగా విభజించగా, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్టీపీఐ పరిధిలో కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సబ్‌సెంటర్లు ఉన్నా యి. తెలంగాణ పరంగా చూస్తే హైదరాబాద్‌లో ప్రధాన ఎస్టీపీఐతోపాటు వరంగల్‌లో ఎస్టీపీఐ సబ్‌సెంటర్ పనిచేస్తోంది. దేశంలోని ఇతర ఎస్టీపీఐలతో పోలిస్తే హైదరాబాద్ ఎస్టీపీఐ, దాని పరిధి లోని సబ్ సెంటర్ల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత సేవ లు, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్(ఈఎస్డీఎం) ఎగుమతుల విలువ ఏటా గణనీ యంగా పెరుగుతోంది. 1992–93లో హైదరాబాద్ ఎస్టీపీఐ ద్వారా రూ.4.76 కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2020–21 నాటికి రూ.72,457 కోట్లకు చేరడం గమనార్హం. రాష్ట్రంలో చిన్న నగరాలకు చోటేదీ? ఐటీ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానానికి చేరేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను ఏర్పాటు చేయా లని చాలాకాలంగా కోరుతోంది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ హబ్‌లలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం కాగా, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. వీటితోపాటు రామగుండం, నల్లగొండ, వనపర్తిలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎస్టీపీఐల కోసం కేంద్రం ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బీపీవో లేదా ఐటీ ఆధారిత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు కేంద్రం నుంచి ఒక్కో సీటుకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ‘ఎస్టీపీఐల ఏర్పాటు ద్వారా మరిన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే అవకాశమున్నా రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. చిన్న నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి సహకారం అందించాల్సిన అవసరం ఉంది’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ సెక్టార్ రికార్డ్! రూ. 5 లక్షల కోట్ల ఎక్స్‌పోర్ట్స్
న్యూఢిల్లీ: ఓవైపు కోవిడ్–19 మహమ్మారి మూడో దశలో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ ఐటీ ఎగుమతులు మాత్రం జంకబోవంటూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) పేర్కొంది. వెరసి ఈ ఏడాది(2021–22) ఎస్టీపీఐ పథకంకింద రిజిస్టరైన కంపెనీల నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది నిలకడ లేదా కొంతమేర వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్ తెలియజేశారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ తదితరాలు అమలవుతున్న నేపథ్యంలో ఎస్టీపీఐ యూనిట్ల సేవలకు అంతరాయం ఏర్పడబోదని వివరించారు. డిజిటల్ పద్ధతిలో జరిగే సాఫ్ట్వేర్ సర్వీసుల ఎగుమతులు కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్టీపీఐ పథకంలో 4,689 సాఫ్ట్వేర్ యూనిట్లవరకూ రిజిస్టరయ్యాయి. దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర వ్యవస్థగా ఎస్టీపీఐ ఏర్పాటైంది. దేశీయంగా నూతన ఆవిష్కరణలతోపాటు, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రెండ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా వర్థమాన సాంకేతికతల పరిజ్ఞానంతో కూడిన 25కుపైగా కేంద్రాలను నెలకొల్పింది. చదవండి:సెన్సార్ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో? -
విశాఖలో ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దేశంలోనే తొలి ఇండ్రస్టియల్–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తులు పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. విశాఖపట్నం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ).. ఈ సీవోఈని ఏర్పాటు చేస్తోంది. ఎస్టీపీఐ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి 12 సీవోఈలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్టీపీఐ డైరెక్టర్ ఓంకార్ రాయ్ తెలిపారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఇండస్ట్రీస్–4 సీవోఈ విశాఖలో ఏర్పాటవుతోంది. వ్యయాలను తగ్గించే టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీ అభివృద్ధిలో లక్సెంబర్గ్ ముందంజలో ఉందని, ఇప్పుడిదే స్థాయిలో విశాఖలో సీవోఈని ఏర్పాటు చేస్తున్నామని ఎస్టీపీఐ విశాఖ జాయింట్ డైరెక్టర్ ఎంపీ దుబే ‘సాక్షి’కి వివరించారు. ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, విద్యుత్ ఉత్పత్తి వంటి భారీ పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై ఈ సీవోఈ దృష్టిసారిస్తుందన్నారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఉత్పత్తులను రూపొందించడానికి ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండదండలు అందిస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రపంచ దేశాలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందించే విధంగా ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఉపయోగపడతాయన్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సీవోఈ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఎస్టీపీఐ 13 సీవోఈలను కలిగి ఉండగా.. ఇప్పుడు మరో 12 సీవోఈలను ఏర్పాటు చేస్తోంది. ఎస్టీపీఐ ఇండియా.. బీపీవో స్కీమ్ ద్వారా దేశంలోనే తొలిసారిగా 10,365 మందికి ఉపాధి కల్పించి రికార్డు సృష్టించినట్టుగా.. ఈ సీవోఈ ఏర్పాటు ద్వారా విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్న ఆశాభావాన్ని దుబే వ్యక్తం చేశారు. చదవండి: విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ ప్రోత్సాహక పథకం కింద దేశవ్యాప్తంగా 247 బీపీవో/ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) తెలిపింది. 102 నగరాల్లో ఇవి విస్తరించాయని వివరించింది. ప్రత్యక్షంగా ఈ యూనిట్ల ద్వారా 41,628 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 10,673 మంది ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి ఐటీ, అనుబంధ సేవల ఎగుమతులు 2016–17లో రూ.526.69 కోట్లు నమోదైతే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.836.42 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఎస్టీపీఐ కొత్తగా 12 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. వీటిలో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ పేరుతో ఒక కేంద్రం వైజాగ్‌లో ఏర్పాటవు తుందని చెప్పారు. బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద చిన్న పట్టణాల్లో ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడంలో భాగంగా బీపీవో యూనిట్ల ఏర్పాటుకు కంపెనీలకు ఎస్టీపీఐ ప్రోత్సాహకాలను అందిస్తోంది. చదవండి : నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్ stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్ -
భారత సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.4.21లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత మూడు దశాబ్దాల్లో భారత సాఫ్ట్వేర్ ఎగుమతులను రూ.4.21 లక్షల కోట్ల కు చేర్చి దేశ ఆర్థిక పురోగతికి సా ఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇం డియా (ఎస్టీపీఐ) ఎనలేని కృషి చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్ రాయ్ అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఎస్టీపీఐ 29వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ సంస్థల భాగస్వామ్యం తో దేశవ్యాప్తంగా ఎస్టీపీఐ 21 నైపుణ్యాభివృద్ధి కేం ద్రాలు (సీఓఈ) ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటి ద్వారా దేశ వ్యాప్తంగా స్టార్టప్ వాతావరణానికి ఊతం లభిస్తుందన్నారు. వెబినార్ సదస్సు వేదికగా! ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థ లు, ఐటీ సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సును ప్రారంభించిన కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడు తూ.. ఐటీ రంగం అభివృద్ధిలో ఎస్టీపీఐ పాత్ర మరువలేనిదన్నారు. ఎస్టీపీఐ ఇటీవలి కాలంలో ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా బీపీఓ రంగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని తె లిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘సాఫ్ట్వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం’లో భాగంగా ఐ ఓటి, బ్లాక్ చెయిన్, ఏఐటీ, ఏఆర్, వీఆర్, ఫిన్‌టెక్, మె డికల్ ఎలక్ట్రానిక్స్, గేమింగ్ యానిమేషన్, మెషీన్ లె ర్నింగ్, డేటా సైన్స్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, చి ప్ డిజైనింగ్ వంటి నూతన ఐటీ సాంకేతికతను దృ ష్టిలో పెట్టుకుని ఎస్టీపీఐ ప్రణాళికలు సిద్దం చే స్తోందన్నారు. ఐటీ పరిశ్రమలో ఎస్టీపీఐ అంతర్భాగంగా మారిందని నాస్కామ్ అధ్యక్షుడు దేవయాని ఘోష్ అన్నారు. ఎస్టీపీఐ వద్ద నమోదైన 18వేలకు పైగా ఐటీ కంపెనీల ద్వారా 40.36 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. జీడీపీలో ఐటీ రంగం వాటా 8 శాతం కాగా, సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారత్ కేంద్రంగా మారుతోందన్నారు. -
చిన్న పట్టణాల్లో బీపీవో కాల్ సెంటర్లు
9వేల సీట్లకు ఎస్టీపీఐ అనుమతి న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కేంద్రాలు మరిన్ని తెరుచుకోనున్నాయి. 9 వేల సీట్ల (ఉద్యోగుల) సామర్థ్యంతో కూడిన పలు బీపీవో కాల్ సెంటర్లను దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వారణాసి, సిలిగురి, పాట్నా, ఉన్నావో, అమరావతి, ధూలే, కటక్, ముజఫర్‌పూర్, దాల్సింగ్సరాయ్ తదితర పట్టణాల్లో బీపీవోలు రానున్నాయి. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 60 ప్రదేశాల్లో 50 కంపెనీలు బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... ఎస్టీపీఐ 9,020 సీట్ల సామర్థ్యానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, సోమవారం ప్రారంభమైన మూడో దశ బిడ్డింగ్ ద్వారా మరో 3,000 సీట్ల సామర్థ్యానికి అనుమతులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. టీసీఎస్, అమేజాన్ తదితర పెద్ద కంపెనీలే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బీపీవో వర్క్‌షాప్ సందర్భంగా కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో బెంగళూరులో పర్యటించిన సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఇతర ప్రాంతాల ప్రజలు తాము తమ స్వస్థలాల్లో పనిచేసుకుంటామని, అందుకోసం ఏదో ఒకటి చేయాలని అడిగారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బీపీవోలు చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయడం పట్ల తనకు సంతోషంగా ఉందని, స్థానికులు తమ ప్రాంతాలను విడిచిపెట్టే అవసరం లేకుండా అక్కడే పనిచేసుకోగలుగుతారని పేర్కొన్నారు. బీపీవో కేంద్రాల ప్రోత్సాహక పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం 48,300 సీట్ల సామర్థ్యం వరకు కాల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనుంది. ఒక్కో సీటుపై రూ.ఒక లక్ష వరకు వ్యయం చేస్తే అందులో సగాన్ని కేంద్రం భరిస్తుంది. -
ఎస్టీపీఐ యూనిట్లకు ఎస్ఈఐఎస్ ప్రయోజనాలు: నాస్కామ్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) యూనిట్లకు సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్ఈఐఎస్) ప్రయోజనాలను 2016-17 బడ్జెట్లో వర్తింపజేయాలని నాస్కామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ, ఐటీఈఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలకు వచ్చే బడ్జెట్ చాలా కీలకమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నియమాల్లో స్పష్టత లేకపోవడంతో ఇక్కడి కంపెనీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. సేఫ్ హార్బర్ మార్జిన్స్‌పై ఉన్న 20-30 శాతం అధిక వడ్డీ రేట్లను ఈ బడ్జెట్లో అయినా సవరించాలన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు వాటికి వ్యాపారానికి అనువైన పరిస్థితులకు కల్పించాలని కోరారు. మ్యాట్తోసహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచి స్టార్టప్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రారంభ దశలో ఉన్న కంపెనీలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేయాలని విన్నవించారు. -
తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు!
హైదరాబాద్: 2013-14 సంవత్సరానికి తెలంగాణ ప్రాంతంలో 57 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయని ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ అధికారికంగా వెల్లడించింది. 2012-13 సంవత్సరానికి సాఫ్ట్ వేర్ ఎగుమతుల విలువ 49,631 కోట్లు అని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. సాఫ్ట్ వేర్ ఎగుమతుల నేపథ్యంలో 3,23,691 ప్రత్యక్ష ఉద్యోగాల్ని కల్పించినటట్టు ఐటీ విభాగం తన నివేదికలో పేర్కొన్నారు. ఈ గణాంకాలను సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూపొందించాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో 14 శాతం వృద్దిని సాధించిందని నివేదికలో తెలిపారు.