బెంగళూరు: కర్ణాటకలో రేపు(శనివారం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు గెలుపు తమదంటే తమదేనని తెగేసి చెబుతున్నాయి. అటు జేడీఎస్ మాత్రం కీరోల్ మాదేనంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎన్నికల్లో ఫలితాల్లో సందర్భానుసారం, కర్ణాటకకు ఎవరితో మంచి జరుగుతుందో బేరీజు వేసుకుని మద్దతు ప్రకటిస్తామని జేడీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించన్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపుపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాలపై కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది.
Karnataka Assembly Elections 2023 LIVE Updates: Sec 144 imposed in Bengaluru, liquor sale banned https://t.co/oCoxBnE9Pd
— Nationalist (@JagdeepakSharma) May 12, 2023
Ramesh rightly observed that Modi is responsible for Karnataka, TN, Kerala, AP, Telangana losses.
South India will be renamed as
Islamic Republic of India
ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
Comments
Please login to add a commentAdd a comment