
సాక్షి, బెంగళూరు : తన మాట వినలేదన్న కోపంతో.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ ఇంటికి వచ్చి హత్య చేస్తానని బెదిరించాడో వ్యక్తి. ఈ ఘటన హోసూరు జిల్లాలోని క్రిష్ణగిరిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన మహిళకు(26)కు కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ ద్వారా సేలం జిల్లా సత్యమంగలం ప్రాంతానికి చెందిన మోహన్‌కుమార్(32)తో పరిచయమేర్పడింది. మోహన్‌కు పెళ్లయినా భార్యతో విభేదాలొచ్చి విడిపోయాడు. కాగా, సదరు మహిళకు పిల్లలు లేరనే విషయం తెలుసుకొన్న మోహన్‌కుమార్.. తమ గ్రామం వద్ద ఉన్న ఓ ఆలయానికొస్తే పరిష్కారం దొరకుతుందని ఆమెను మభ్య పెట్టాడు. ఆమె మోహన్‌కుమార్ చెప్పిన చోటికి రాకపోవడంతో సోమవారం క్రిష్ణగిరి వచ్చాడు. ఆమె ఇంటికెళ్లి తనతో రావాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేస్తానని బెదిరించాడు. ఘటనపై బాధితురాలు క్రిష్ణగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోహన్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment