
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్రదుర్గ ప్రాంతంలోని చల్లకెరేకు చెందిన రామక్రిష్ణ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇలా దాదాపు 200 మందికి నగ్న చిత్రాలను పంపించాడు. వీరిలో 120 మంది మహిళలు కూడా ఉన్నారు. చల్లకెరేకు చెందిన చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. ( అదృష్ట దేవతమీదేనంటూ వల )
అయితే రామక్రిష్ణ తన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో అతడ్ని కనుక్కోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. శుక్రవారం అతడు ఫోన్ ఆన్ చేయటంతో ట్రేసింగ్ ద్వారా ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఫోన్ రింగ్ అయిన నెంబర్లకు మాత్రమే ఫొటోలు పంపుతానని చెప్పాడు. చాలా మంది మహిళలను వారి నగ్న చిత్రాలు పంపమంటూ వేధించానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment