సాక్షి, బెంగళూరు : నటి సోనుగౌడ సీఎం యడియూరప్పకు సవాల్ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్ ఫోన్ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ ప్రశ్నించారు. గతంలో మత్స్య కన్య వేషంలో ఉన్న ఫోటోను కూడా వేశారు. ఇటీవల కళాకారుడు బాదల్ నంజుండస్వామి గగనయాత్ర అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్–2 ఫొటోలను కూడా జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment