
వీడియో దృశ్యాలు
బెంగళూరు : మనకు నచ్చిన పని చేసినపుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ పనిలో గొప్ప స్థాయిలకు చేరుకోగలుగుతాం లేదా అద్భుతమైన నైపుణ్యత సాధిస్తాం. అలవాటుగా నేర్చుకున్నదైనా.. ఓ ఆశయంగా మలుచుకున్నదైనా మనలో ప్రతిభ ఉన్నపుడు జనం జేజేలు కొట్టక తప్పదు. ప్రస్తుతం ఇంటర్‌నెట్ పుణ్యమా అని కళాకారుల ప్రతిభకు తక్కువ సమయంలో గుర్తింపు దక్కుతోంది. తాజాగా హిరోనికా(మౌత్ ఆర్గాన్) వాయిస్తూ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిందో యువతి. ( ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!)
బెంగళూరుకు చెందిన ఆకాంక్ష శెట్టి అనే యువతి చాలా నైపుణ్యంతో ‘బీట్‌బాక్స్’.. నోటితో డప్పులాంటి చప్పుళ్లు చేస్తూ మరో వైపు హార్మోనికా వాయిస్తూ లయబద్ధంగా సంగీతాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాంక్ష స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. ( వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది )
Comments
Please login to add a commentAdd a comment