Sandalwood Drug Case: డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటీమణుల పేర్లు | CCB Police Raids on Kannada Actress Ragini Dwivedi House in Bengaluru - Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటీమణుల పేర్లు

Published Fri, Sep 4 2020 7:22 AM | Last Updated on Fri, Sep 4 2020 4:36 PM

Sandalwood Drug Case Actress Sanjana Friend Arrested - Sakshi

బెంగళూరు : శాండల్‌వుడ్డ్రగ్స్‌ వ్యవహారం నానాటికీ విస్తరిస్తోంది. డ్రగ్స్‌ కేసులో ప్రముఖ అందాల నటి రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. రాగిణి పేరు ప్రచారంలోకి రావడంతో వారిద్దరికీ నోటీసులు పంపారు. అయితే రాగిణి హాజరు కాలేదు. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని సమాచారం సేకరిస్తున్నారు. మరింత విచారణ కోసం కోర్టు అనుమతితో కస్టడీకీ తీసుకోవాలని నిర్ణయించారు. రాగిణికి శుక్రవారం హాజరు కావాలని మళ్లీ నోటీసులు పంపారు. బుధవారం రాత్రి నోటీసు ఇవ్వటానికీ పోలీసులు యలహంకలోని రాగిణి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేక పోవటంతో వాట్సాప్‌ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆమె ముఖం చాటేస్తుండడంతో పోలీసుల్లో అనుమానం పెరిగింది. అయితే రాగిణి తన న్యాయవాది ద్వారా సీసీబీ అఫీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల హాజరు కాలేదని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.  

సంజన ఆప్తుడు అరెస్ట్‌
నటి సంజన ఆప్తుడు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని శాండల్‌వుడ్‌లో నటీనటులు ఆందోళనకు గురవుతున్నారు. రాహుల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్‌లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు. రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు సంజన తెలిపారు.  ( ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా... )

బాలీవుడ్‌తో సంబంధాలు : ప్రశాంత్‌
శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ మాఫియాకు బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగి ఆరోపించడంతో ముడి మరింత బిగుసుకుంది. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్‌ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ప్రశాంత సంబరగి గురువారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ఇంతియాజ్‌ ఖాత్రితో బాలీవుడ్‌ నటీనటులు, నిర్మాతలకు మంచి సంబధాలున్నాయి. అతని పుట్టినరోజుకు సినీరంగ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇటీవల బెంగళూరులో ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అతడు కూడా హాజరయ్యాడు అని చెప్పారు. నటీమణులు రాగిణి, సంజనలపై కూడా సంబరగి డ్రగ్స్‌ ఆరోపణలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement