పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు(వృత్తంలో) కీలక నిందితుడు తబ్రేజ్
సాక్షి, బెంగళూరు : తన భార్యను తనకు కాకుండా చేశాడన్న కసితో కర్ణాటకలో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్యను తీసుకెళ్లిపోయిన వ్యక్తిని దారుణంగా చంపి, రక్తం తాగాడు. ఈ కేసులో తబ్రేజ్, నిజామ్, అలీ అండు అనే ముగ్గురు నిందితులను డీజే హళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ భార్యను సుభాన్ అనే వ్యక్తి లోబర్చుకుని తమకూరుకు తీసుకెళ్లి అక్కడ నివాసం ఉంటున్నాడు. దీంతో సుభాన్‌ను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించాడు తబ్రేజ్. మే నెలలో పై ముగ్గురు నిందితులు తుమకూరులోని సుభాన్ అపహరించి బెంగళూరుకు తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టి కొట్టి చంపి డీజేహళ్లి పోలీసుస్టేషన్ వద్ద పడేశారు. ( మాజీ ప్రేయసి ప్రియుడితో ఉండగా..)
దర్యాప్తులో దారుణ నిజాలు
మొదట పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. తబ్రేజ్ భార్యను అదుపులోకి తీసుకొని విచారించారు. తబ్రేజ్‌తో కలిసి ఉండలేనని ఆమె పోలీసుల ముందు చేప్పేసింది. తను సుభాన్‌తో కలిసి ఉండడం వల్ల తబ్రేజ్ హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితులతో కలిసి సుభాన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తబ్రేజ్ పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. తన భార్య తీసుకేళ్లిన సుభాన్‌ను హత్య చేయటమేకాదు, అతడి రక్తం కూడా తాగినట్లు తబ్రేజ్ వెల్లడించడంతో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. తబ్రేజ్‌తో పాటు అతడి స్నేహితులు నిజామ్, అలీ అండులను అరెస్ట్ చేశారు. తన భార్యను తనకు కాకుండా చేశాడన్న కసితో రక్తం తాగినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తబ్రేజ్‌పై బెంగళూరులో జేబు దొంగగా అనేక కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment