
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు
సాక్షి, బెంగళూరు : దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికీ సంబంధించి ఐదు మంది నిందితులను మంగళూరు జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పుత్తూరు తాలూకా బజత్తూరు గ్రామానికి చెందిన గురునందన్ అలియాస్ రాధాకృష్ణ, ఆర్యాపు గ్రామం పిలిగుండకు చెందిన సునీల్ అలియాస్ కాంతప్పగౌడ, బంట్వాళ తాలూకా పెర్నె గ్రామానికీ చెందిన ప్రజ్వల్ అలియాస్ నాగేశ్ నాయక్, కిషన్ అలియాస్ సదాశివ, బరిమారు గ్రామానికి చెందిన బల్య ప్రఖ్యాత్ అలియాస్ సుబ్బణ్ణశెట్టిలను అరెస్ట్ చేసినట్లు దక్షిణ కన్నడ ఎస్పీ బీఎం లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఇటీవల పుత్తూరుకు చెందిన విద్యార్థిపై వీరు సామూహిక అత్యచారానికీ పాల్పడిన్నట్లు అయన వివరించారు. వీరిపై పుత్తూరు మహిళ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైయింది.