
ఆన్‌లైన్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందిస్తోన్న అప్‌గ్రాడ్ సంస్థ హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ని ఏర్పాటు చేసింది. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఇండిక్యూబ్ పెర్ల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
నగరంలో ఐటీ సంస్థలు కొలువైన గచ్చిబౌలిలో ఇండిక్యూబ్ పెరల్ బిల్డింగ్‌లో 170 సీట్లతో సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో క్లాస్ రూమ్స్‌తో పాటు జిమ్, మల్టీ క్యూజిన్, గేమింగ్ జోన్, కేఫ్ టేరియా, కొలబరేషన్ స్పేస్, ఈవెంట్ వెన్యూ, బ్రేక్ అవుట్ ఏరియా, విజిటర్స్ లాంజ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
ఎడ్యుటెక్ ఇండస్ట్రీలో మంచి గ్రోత్ కనిపిస్తుండటంతో గ్లోబల్ కంపెనీగా ఎదిగేందుకు అప్‌గ్రాడ్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇంటర్నేషన్ స్టాండర్డ్స్‌తో ఉన్నత విద్య కోర్సులను ఎక్కువగా ప్రవేశపెడుతోంది. దీనికి తగ్గ సిబ్బందిని హైర్ చేసుకుంటోంది. బిగ్‌డేటా విభాగంలో హైదరాబాద్‌పై అప్‌గ్రాడ్ ఫోకస్ చేసింది.
హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఒకేసారి సెంటర్ల్లు ఓపెన్ చేసింది అప్‌గ్రాడ్ సంస్థ. బెంగళూరు సెంటర్‌లో 830 సీట్లు ఉండగా హైదరాబాద్ సెంటర్‌లో 170 సీట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సెంటర్లను మరింతగా విస్తరించే యోచనలో ఉంది అప్‌గ్రాడ్.