బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్‌కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌కు సంబంధించి మాట్లాడారు.
‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్‌లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు.
న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment