నిందితుడు బబిత్, ఇద్దరు ప్రియుళ్లతో యువతి (ఫైల్)
సాక్షి, బెంగళూరు : తనను వదిలేసిందని మాజీ ప్రేయసిపై ఓ యువకుడు దాడిచేసిన సంఘటన నెలమంగల సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... 21 సంవత్సరాల యువతి.. బబిత్ అనే యువకునితో 4 ఏళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఇటీవలే భిన్నాభిప్రాయాలు వచ్చి దూరంగా ఉంది. తరువాత యువతికి రాహుల్ అనే మరో యువకుడు పరిచయమై ప్రేమలో పడింది. ఈ క్రమంలో యువతి కొత్త ప్రియుడి ఇంట్లో ఉండగా హఠాత్తుగా అక్కడకు వచ్చిన మాజీ ప్రియుడు యువతిపై హెల్మెట్‌తో తీవ్రంగా కొట్టాడు. ( నటి చందన ఆత్మహత్య కేసు.. ప్రియుడు అరెస్ట్)
యాక్సిడెంట్ అని తప్పుడు సమాచారం
యువతి రక్తగాయాలతో సృహతప్పి పడిపోగా యువతి ఇంటికి ఫోన్ చేసి మీ కుమార్తెకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు. యువతిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తరువాత జరిగింది యాక్సిడెంట్ కాదు, దాడి అని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె కొత్త, పాత ప్రియుడు ఇద్దరూ స్నేహితులని, కొత్త ప్రియుడు సమాచారం ఇవ్వడంతోనే మాజీ ప్రియుడు వచ్చి దాడి చేశాడని తెలిసింది. అదీకాక ముగ్గురూ ఒకే కాలనీ వాసులు. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదుచేసుకుని బబిత్, రాహుల్ ఇద్దరినీ అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment