
ఆపరేషన్ తరువాత కోలుకుంటన్న దూడ
చేవెళ్ల : మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన శేరి బాల్‌రెడ్డికి చెందిన గేద శనివారం దూడకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన దూడకు జన్యులోపం హెర్నియా (పుట్టుకతో వచ్చే లోపం) కారణంగా కడుపులో ఉండాల్సిన పేగులు బయటకు వచ్చాయి. దీంతో రైతు వెంటనే చేవెళ్లలోని పశువైద్యశాలలో ఉన్న వైద్యులు డాక్టర్ మధుసూధన్ వద్దకు తీసుకు వచ్చారు. దూడ పరిస్థితిని పరిశీలించిన వైద్యుడు మధుసుధన్ మాట్లాడుతూ... ఇది జన్యు సంబంధమైన లోపం కారణంగా బొడ్డు లోపల ఉండాల్సిన పేగులు బయటకు వచ్చాయన్నారు. దీంతో వెంటనే ఆయన దూడకు అపరేషన్ చేసి పేగులను కడుపులో పెట్టి కుట్లు వేశారు. ఆపరేషన్ తరువాత దూడ ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. దూడను బతికించిన వైద్యునికి రైతు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment