
చిన్నశంకరంపేట(మెదక్): మూడు కళ్లతో లేగదూడ జన్మించిన సంఘటన చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గజగట్లపల్లి గ్రామానికి చెందిన గిర్కల వెంకటయ్యకు చేందిన ఆవుకు బుధవారం ఉదయం లేగదూడ జన్మించింది. లేగ దూడకు మూడు కళ్లు ఉండడంతో పాటు ముక్కులేదు. దీంతో గ్రామస్తులు లేగదూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.