
బనగానపల్లె : మండల పరిధిలోని నందివర్గం గ్రామానికి చెందిన సూరబోయిన కర్ణ తన కోడెదూడను రూ.2.40 లక్షలకు విక్రయించాడు. నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చెందిన నాయుడు కొనుగోలు చేశారు. ఈ కోడెదూడకు రాతి దూలం లాగుడు పోటీల్లో రాణించే లక్షణాలుండడంతో అంత మొత్తం వెచ్చించి కొనుగోలు చేశానని ఆయన తెలిపాడు. నెలరోజుల క్రితం మరో కోడెదూడను రూ.2లక్షలకు విక్రయించినట్లు కర్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment