
ఆవుకు జన్మించిన జెర్సీ, హెచ్‌ఎఫ్ లేగదూడలు
నాతవరం: మండలంలో మర్రిపాలెం శివారు మోక్లాంగులపాలెం గ్రామంలో అల్లు నూకాలమ్మకు చెందిన జెర్సీ ఆవు బుధవారం ఒకే కాన్పులో రెండు జాతులకు చెందిన లేగదూడలకు జన్మనిచ్చింది. స్ధానిక గోపాలమిత్ర రంభా నానిబాబు ఆవుకు ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు హెచ్‌ఎఫ్ ఇంజక్షన్ చేశాడు. జెర్సీ ఆవుకు హెచ్‌ఎఫ్ ఇంజక్షన్ చేయడం వల్ల అదే జాతి లేగదూడ జన్మించాలి. అలాకాకుండా వేర్వేరు జాతులకు చెందిన దూడలు జన్మించాయి. ఈ పశు వైద్యాధికారి సాయిశంకర్ మాట్లాడుతూ ఆవు ఎద సమయంలో ఎద సమయంలో ఉన్నప్పుడు అండంలో 10లక్షల వీర్య కణాలు విడుదల అవుతాయన్నారు. రెండుసార్లు హెచ్‌ఎఫ్ ఇంజక్షన్ చేయడం వల్ల అండం రెండు సార్లు విడుదల కావడంతో రెండు జాతుల లేగదూడలు జన్మించాయని వివరించారు.