marripalem
-
ప్రమాదకర ప్లాస్టిక్ రహిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
-
ఒకే కాన్పులో అరుదైన లేగదూడలు
నాతవరం: మండలంలో మర్రిపాలెం శివారు మోక్లాంగులపాలెం గ్రామంలో అల్లు నూకాలమ్మకు చెందిన జెర్సీ ఆవు బుధవారం ఒకే కాన్పులో రెండు జాతులకు చెందిన లేగదూడలకు జన్మనిచ్చింది. స్ధానిక గోపాలమిత్ర రంభా నానిబాబు ఆవుకు ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు హెచ్ఎఫ్ ఇంజక్షన్ చేశాడు. జెర్సీ ఆవుకు హెచ్ఎఫ్ ఇంజక్షన్ చేయడం వల్ల అదే జాతి లేగదూడ జన్మించాలి. అలాకాకుండా వేర్వేరు జాతులకు చెందిన దూడలు జన్మించాయి. ఈ పశు వైద్యాధికారి సాయిశంకర్ మాట్లాడుతూ ఆవు ఎద సమయంలో ఎద సమయంలో ఉన్నప్పుడు అండంలో 10లక్షల వీర్య కణాలు విడుదల అవుతాయన్నారు. రెండుసార్లు హెచ్ఎఫ్ ఇంజక్షన్ చేయడం వల్ల అండం రెండు సార్లు విడుదల కావడంతో రెండు జాతుల లేగదూడలు జన్మించాయని వివరించారు. -
యోగా టీచర్ హత్య కేసు నిందితుడిపై హత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: యోగా టీచర్ హత్య కేసులో నిందితుడిపై హత్యాయత్నం జరిగింది. మర్రిపాలెం ‘వుడా’ లే అవుట్ లో శుక్రవారం అర్ధరాత్రి వెంకటరమణ అనే యోగ టీచర్‌ను ఇంట్లోనుంచి బయటకు పిలిచి నలుగురు దుండగులు రాడ్లతో కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు కీలపర్తి వెంకట రమణపై ఆదివారం ఉదయం హత్యా యత్నం జరిగింది. కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు కేజీజీహెచ్కు తరలించారు. -
యోగా టీచర్ దారుణ హత్య
-
యోగా టీచర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానిక ‘వుడా’ లే అవుట్లో ఉంటున్న యోగా టీచర్ ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. నలుగురు కిరాయి మనుషులు వెంకటరమణ అనే యోగ టీచర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పిలిచారు. బయటకు వచ్చాక నడి రోడ్డుపైనే రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. జనగోల అనే పత్రిక నిర్వాహకుడు కీలపర్తి వెంకట రమణ ఈ హత్యకు సూత్రధారి అని, యోగా టీచర్ల మధ్య పోటీయే హత్యకు కారణం అని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పాస్‌పోర్ట్ మేడ్ ఈజీ...
నేడు రెండో సేవా కేంద్రం ప్రారంభం మరింతమందికి అవకాశం మర్రిపాలెం (విశాఖ): విశాఖలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి వస్తోంది. మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 మంగళవారం ప్రారంభం కానుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల రద్దీ, తాకిడి దృష్ట్యా మరో సేవా కేంద్రం అవసరమని అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖకు అవసరం తెలియజేశారు. ఇక్కడి కేంద్రంలో వసతులు, కౌంటర్ల విషయాన్ని కేంద్రానికి అందచేశారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సేవలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది జనవరిలో విశాఖ ప్రాంతీయ కేంద్రంగా అవతరించింది. విశాఖకు అనుబంధంగా విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆగస్టు 2011 నుంచి మురళీనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ప్రజలు సేవలు పొందుతున్నారు. ఇక్కడి కేంద్రంలో 18 కౌంటర్లు పనిచేస్తుండగా రోజుకు 975 దరఖాస్తులు పరిశీలించి స్వీకరిస్తున్నారు. ఇకపై అదనంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 పేరుతో మర్రిపాలెం ఉడా లేఅవుట్ దరి పాస్‌పోర్ట్ కార్యాలయ భవనం మొదటి అంతస్తులో సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కార్యాలయంలో ప్రత్యేక వసతులు, అన్ని హంగులు కల్పించారు. 10 కౌంటర్లు ఏర్పాటుచేసి రోజుకు 450 మందికి అవకాశం కల్పిస్తారు. -
తగ్గిన ‘హై సెక్యూరిటీ’
మర్రిపాలెం : ‘హై సెక్యూరిటీ’ నంబర్ ప్లేట్లకు ఆదరణ త గ్గుతోంది. రక్షణ, భద్రత లక్ష్యంగా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ విధానం సక్రమంగా అమలు కావడంలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డులు తప్పక అమర్చాలన్న ఆదేశాలను వాహనచోదకులు పట్టించు కోవడంలేదు. సంబంధిత అధికారులు కూడా శ్రద్ధ చూపకపోవడంతో హై సెక్యూరిటీ విధానం నిర్లక్ష్యానికి గురవుతోంది. కానరాని నాణ్యత ప్రమాణాలు గతేడాది డిసెంబర్ 11 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ బోర్డుల ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి వాహనాలకు బోర్డులు అమర్చడం జరుగుతోంది. బోర్డుల నాణ్యత పాటించకపోవడంతో వాహనచోదకులు రవాణా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోర్డుల తయారీ సంస్థ ‘లింక్ ఆటో టెక్’కు అధికారులకు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అయినా మార్పు లేకపోవడంతో యజమానులు కొనుగోలు చేయడం తగ్గించారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర ్శలు వినిపిస్తున్నాయి. తగ్గిన డిమాండ్ కొత్త రిజిస్ట్రేషన్ వాహనాలన్నీ దాదాపు స్టిక్కరింగ్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ‘హై సెక్యూరిటీ’లో లోపాలు సాకుగా చూపించి యజమానులు సామాన్య బోర్డులు అతికిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో బోర్డులకు ఆయా సంస్థలు ఐదేళ్ల వారంటీని ప్రకటిస్తున్నా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ‘హై సెక్యూరిటీ’ బోర్డుల బుకింగ్‌లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నెలకు నాలుగు వేలకు పైగా టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు కాగా దాదాపు వెయ్యి బోర్డులకు బుకింగ్ ఉంటోంది. కేవలం 10 శాతం మంది మాత్రమే కార్లకు ‘హై సెక్యూరిటీ’ బోర్డులు కోరుకుంటున్నారు. -
‘ఎల్లో బస్’ తుది పలుకులు
నాది దాదాపు 50 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న వారెందరో మొదట్లో నా ఒడిలో డ్రైవింగ్ నేర్చుకున్నవారే. వారందరి జీవితాలకు రాజమార్గాన్ని చూపిన నన్ను ఇప్పుడు ఎవరికీ పట్టనట్లు మూలనపడేశారు. నా వల్ల ఎంతో ప్రయోజనం పొంది కూడా ఇప్పుడు నా బాగోగులు చూసుకునే నాథులే లేరు. ఇంతకీ నేనెవరెంటే.. ‘ఎల్లో బస్’ని. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఉంటాను. పుట్టింది, అడుగు పెట్టింది 1965. నా విధి భారీ వాహనాలు నడపడానికి శిక్షణ ఇవ్వడం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘డ్రైవింగ్’ నేర్పడం. ఇప్పటికే వేలాది మందిని డ్రైవర్లుగా తయారు చేశాను. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి కల్పించాను. వేలాదిమందిని రవాణా కార్మికులుగా తీర్చిదిద్ధిన ఘనత నాది. డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పాను. అందరి జీవితాల్లో వెలుగు నింపాను. ఉపాధితో దారి చూపాను. విచిత్రం ఏమిటంటే గురువుగా నన్ను గౌరవించలేదు. శిక్షణ పూర్తి తర్వాత నావైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల సామర్థ్య పరీక్షకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాను. వయస్సు మీరిందని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. నన్ను నేరుగా తీసుకువచ్చి ఐటీఐలో పడేశారు. రోజూ పలుకరించి నా ఆలన...పాలన చూసుకునే డ్రైవర్ రావడం మానేశాడు. ఐటీఐ అధికారులు నన్ను తుక్కు విలువకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారా! అనే సందేహం కలుగుతోంది. అదే జరిగితే ఇక నేను కనిపించను. విజయవాడ బస్టాండులో ఓ పాత ఆర్టీసీ బస్సును ప్రదర్శనగా ఉంచారని. ఆర్టీసీకి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజల సందర్శన కోసం బస్టాండులో అలా ఉంచారని విన్నాను. ఇక్కడ పాత ఐటీఐలో బోలెడంత ఖాళీ స్థలం ఉంది. నన్ను కూడా అలా ప్రదర్శనగా ఉంచితే ఎంత బాగుంటుందో కదూ.. - న్యూస్‌లైన్, మర్రిపాలెం