నగరంలోని మర్రిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానిక ‘వుడా’ లే అవుట్‌లో ఉంటున్న యోగా టీచర్ ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. నలుగురు కిరాయి మనుషులు వెంకటరమణ అనే యోగ టీచర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పిలిచారు. బయటకు వచ్చాక నడి రోడ్డుపైనే రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. జనగోల అనే పత్రిక నిర్వాహకుడు కీలపర్తి వెంకట రమణ ఈ హత్యకు సూత్రధారి అని, యోగా టీచర్ల మధ్య పోటీయే హత్యకు కారణం అని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.