four persons
-
యోగా టీచర్ దారుణ హత్య
-
యోగా టీచర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానిక ‘వుడా’ లే అవుట్లో ఉంటున్న యోగా టీచర్ ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. నలుగురు కిరాయి మనుషులు వెంకటరమణ అనే యోగ టీచర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పిలిచారు. బయటకు వచ్చాక నడి రోడ్డుపైనే రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. జనగోల అనే పత్రిక నిర్వాహకుడు కీలపర్తి వెంకట రమణ ఈ హత్యకు సూత్రధారి అని, యోగా టీచర్ల మధ్య పోటీయే హత్యకు కారణం అని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు
ఏలూరు (సెంట్రల్): ఆస్తి కోసం ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి నిప్పు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాటపర్రు గ్రామంలోని రామాలయం వీధిలో నివాసముండే గంటా పార్వతి అనే మహిళ వెంకట్రావు అనే వ్యక్తిని దత్తత తీసుకుంది. అతడి భార్య సరోజిని అత్త పార్వతిని ఇంటి నుంచి వెళ్లిపోమ్మనగా ఆమె నిరాకరించింది. దీంతో 2013 జనవరి 3న పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉండగా సరోజిని, వెంకట్రావు, మరికొందరు కలిసి ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికులు మంటలను అదుపుచేసి గాయాలైన పార్వతిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి మృతిచెందింది. పార్వతి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో గంటా సరోజిని, వెంకట్రావు, చాటపర్రు గ్రామానికి చెందిన అనమిల్లి నాగమణి, వీరవాసరం గ్రామానికి చెందిన కొల్లు వెంకటేశ్వరరావుకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తీర్పు చెప్పారు. -
వేర్వేరుచోట్ల నలుగురి ఆత్మహత్య
వెంకటాపురం : కడుపునొప్పి భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది, వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ కథనం ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన తడక నాగరాజు-లావణ్య దంపతుల పెద్ద కూతురు ప్రత్యూష(16) ములుగులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ప్రత్యూషకు సోమవారం రాత్రి 10 గంటలకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బాధ భరించలేక ఆల్‌అవుట్‌కు చెందిన లిక్విడ్‌ను తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ప్రత్యూషను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతిచెందింది. మృతురాలికి సోదరితోపాటు సోదరుడు ఉన్నాడు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని.. కుందారం(లింగాలఘణపురం) : మండలంలోని కుందారంలో మంద వనరాజు(42) అనే వ్యక్తి తన ఇంట్లో మంగళవారం ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య గత కొన్ని రోజులుగా కాపురానికి రావడం లేదు. అతడి తల్లి, కూతురు ఇటీవల బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు దూలానికి ఉరివేసుకున్నాడు. అంతేగాక అతడు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్లు గ్రామస్తులు గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియలేదు. మహిళ ఆత్మహత్య చిట్యాల : కూతురి కాపురంలోని కలహాలతో కలత చెందిన ఓ మహిళ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని టేకుమట్లలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల భారతి(48), లింగయ్య దంపతులకు కుమార్తెలు స్వర్ణలత, స్నేహలత, కుమారుడు క్రాంతికుమార్ ఉన్నారు. ఆరేళ్ల క్రితం మొగుళ్లపల్లి మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన యువకుడితో స్వర్ణలతకు వివాహమైంది. ఆమె కుటుంబంలోని గొడవలతో రెండేళ్లుగా స్వర్ణలత తన తల్లిగారింట్లోనే ఉంటోంది. తన కుమార్తె కాపురం గురించి మనోవేదనకు గురైన భారతి కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సమ్మిరెడ్డి తెలిపారు. భారతి మృతితో టేకుమట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి ఆత్మహత్య హన్మకొండ చౌరస్తా : కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. హన్మకొండ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండలోని పోచమ్మకుంట ప్రాంతానికి చెందిన మంజల శ్రీకాంత్(29) రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. మందులు వాడుతున్నా నొప్పి తగ్గడం లేదనే మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుప్పకూలిన విమానం.. సిబ్బంది అదృశ్యం
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన ఓ కార్గో విమానం బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది. నలుగురు సిబ్బందితో బయలుదేరిన చిన్న కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. బంగ్లాదేశీ పట్టణంలోని కోక్స్ బజార్ తీరం సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. కో-పైలట్ , మరో ఇద్దరు అదృశ్యం అయ్యారు.. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
ఊరేగింపులో అపశృతి.. నలుగురు భక్తుల మృతి
వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాలయ ఉత్సవంలో గురువారం అపశృతి దొర్లింది. గురువారం తెల్లవారుఝామున వందలాది మంది భక్తులు పాల్గొన్న దేవుని ఊరేగింపులో కరెంటుషాక్ కొట్టడంతో నలుగురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తీగలను తాకిన నలుగురు భక్తులు అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. -
యువతిపై సామూహిక అత్యాచారం
కాశీబుగ్గ : వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన ఓ యువతిపై శనివారం తెల్లవారుజామున నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గుర్తించి ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా బాలాజీనగర్‌కు చెందిన బైరిపాటి రాజ్‌కుమార్, దండం రవి, కడెం నర్సింహ, నారాయణ అనే నలుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది. కాగా వీరిలో ముగ్గురు యువకులు పరారీలో ఉండగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.