వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాలయ ఉత్సవంలో గురువారం అపశృతి దొర్లింది. గురువారం తెల్లవారుఝామున వందలాది మంది భక్తులు పాల్గొన్న దేవుని ఊరేగింపులో కరెంటుషాక్ కొట్టడంతో నలుగురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.
ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తీగలను తాకిన నలుగురు భక్తులు అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.