
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన చూడి గేదె 10 నెలలు అవుతున్నా ఈనక పోవడంతో పశు వైద్యుడు శశికుమార్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని గుర్తించారు. పశువుకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీశారు. దూడ 2 తలలు, 6 కాళ్లతో జన్మించి కొద్దిసేపటికే మృతి చెందింది. చదవండి: (కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం)