
సాక్షి, కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ స్వచ్ఛందంగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ వచ్చింది. ఆయన శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. గత 20 రోజులుగా ప్రజల్లో నిరంతరం తిరుగుతూ నియోజకవర్గ పరిధిలోని కూచిపూడిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ తెలిపారు.
ఇక శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడి ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు. 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 523 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment