రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం
Published Fri, Apr 8 2016 7:58 PM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో ఈ నెల 15న శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజ అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామి వార్లకు పుణ్యహావచనం, రుత్విక్‌హరణం, పంచోపనిషత్, మహాభిషేకం నిర్వహించారు.
నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి త్రిరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తుల రథోత్సవం ఉంటుంది. రాజన్న సన్నిధిలో జరిగే రాములోరి పెళ్లికి వేలాది మంది శివపార్వతులు తరలివచ్చి రాజన్నను కల్యాణమాడటం ఇక్కడి విశేషం.
Advertisement
Advertisement