దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఫెస్టివల్ ఆఫర్‌ని ప్రకటించింది పేటీఎం సంస్థ. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా రూ.10,001 విలువైన బంగారాన్ని గెలుపొందే అవకాశం కల్పిస్తోంది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది.
బుక్ చేసుకుంటే చాలు
ఈ ఫెస్టివల్ ఆఫర్‌ను పొందాలంటే గ్యాస్ బుకింగ్ సమయంలో పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ నుంచి చెల్లింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
క్యాష్‌బ్యాక్ పాయింట్లు
పేటీఎం డిజిటల్ గోల్డ్ తో పాటుగా ప్రతీ బుకింగ్ పై యూజర్లు రూ 1,000 విలువైన క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ల కూడా రిడీమ్ చేసుకోవచ్చు
రోజుకి ఐదుగురు
గ్యాస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ వరకు సిలిండర్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఫీచర్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతోపాటు రీఫిల్స్ కు సంబంధించి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్స్ పొందే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నవరాత్రి ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా ప్రతి రోజూ ఐదుగురిని ఎంపిక చేసి రూ.10,001 విలువైన బంగారాన్ని అందిస్తామని పేటీఎం ప్రతినిధులు తెలిపారు.
చదవండి : షో స్టాపర్స్ బ్యూటీ హంట్
Comments
Please login to add a commentAdd a comment