ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియో పోస్ట్ చేశారు. శరన్నవరాత్రిలోని తొలి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారికి చెందిన వీడియో పోస్ట్ చేశారు. దీంతోపాటు మణిపూర్ వాసులకు ‘మేరా చారేన్ హుబా’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.