ఉస్మానాబాద్లో తొక్కిసలాట: భక్తుడు మృతి | One killed in Navratri stampede in Maharashtra | Sakshi
Sakshi News home page

ఉస్మానాబాద్లో తొక్కిసలాట: భక్తుడు మృతి

Published Sat, Oct 5 2013 10:18 AM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM

One killed in Navratri stampede in Maharashtra

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో దసరా నవరాత్రుల సందర్భంగా తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు  సమీప గ్రామాల నుంచి  భక్తులు శనివారం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా దేవాలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో తీవ్ర తొక్కిలసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకరు మరణించారు.

 

ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దేవాలయ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నవరాత్రుల సందర్భంగా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన అధికారులు, సిబ్బంది సరైన చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement