Osmanabad
-
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆ రెండు నగరాల పేరు మార్పు!
ముంబై: బీజేపీ అధికారంలో ఉన్న చోట పురాతన నగరాల పేర్ల మార్పు చేపట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పట్టణాల, నగరాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో రెండు ప్రముఖ నగరాల పేర్లను మార్చబోతోంది. అందుకు కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ధృవీకరించారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని ఏళ్లుగా ఈ డిమాండ్ నడుస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. చదవండి: మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్ దాడిలో.. -
రూ. 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
చుంచుపల్లి: ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి పుణేకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌చేశారు. వారి నుంచి రూ. 1.25కోట్ల 626 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చుంచుపల్లి సీఐ గురుస్వామి చెప్పారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్యాం శివాజీ ఖలే, ప్రభాకర్ తంబే, అరవింద్ గులేతో పాటు కున్లు ఒడిశా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని 26 బస్తాల్లో పేర్చి లారీలో కొబ్బరి మొక్కల మధ్యలో పెట్టి భద్రాచలం, కొత్తగూడెం మీదుగా తరలిస్తుండగా చుంచుపల్లి విద్యానగర్ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై మహేష్ పట్టుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా, కున్లు పరారయ్యాడు. -
భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష!
ఉస్మానాబాద్: మహారాష్ట్రలో అమానుష ఘటన జరిగింది. నేటి ఆధునిక కాలంలోనూ భార్యను అనుమానిస్తూ శీల పరీక్ష చేశాడు. పురాణాల్లో అగ్ని పరీక్ష చేయగా నేడు భర్త సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్‌లో జరిగింది. అయితే భార్యకు పరీక్ష చేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తపై కోపంతో భార్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. నాలుగు రోజుల పాటు కారు డ్రైవరైన ఆ భర్త ఆమె కోసం గాలించాడు. ఎంతకీ భార్య ఆచూకీ లభించలేదు. ఐదో రోజు భార్య ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్యను ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా.. ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పింది. గొడవపడిన రోజు కచాపురి చౌక్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లిపోయారని భార్య చెప్పింది. తీసుకెళ్లిన వారు నాలుగు రోజులు తమ వద్దే ఉంచుకున్నారని.. తనను ఏమీ చేయలేదని భర్తకు చెప్పింది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చా అని భార్యప్వాపోయింది. అయితే ఈ విషయాలను భర్త నమ్మలేదు. దీంతో తమ (పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు. కాగె నూనెలో వేసిన నాణేన్ని చేతితో తీయడంతో భార్యకు చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమె చెప్పేది తాను నమ్మనని.. ఆమె నిజం చెబుతుందో.. అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలనుకుని అలా చేసినట్లు భర్త సమాధానం ఇస్తున్నాడు. తప్పు చేస్తే చేతులు, కాళ్లు కాలిపోతాయని ఆయన చెబుతున్నాడు. అతడి తీరుపై మహిళా సంఘాలతో సామాజికవేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర శాసనమండలి చైర్పర్సన్ నీలమ్ గోర్హె ఆగ్రహం వ్యక్తం చేసి అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil. The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp — BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021 -
మేక పాలతో సబ్బుల తయారీ!
ఔరంగాబాద్: అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా రైతులకు ఇప్పుడు ‘ఉస్మానాబాదీ మేక’ ఆదాయ వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని దాదాపు 250 కుటుంబాలు మేక పాలతో సబ్బులను తయారుచేసి జీవనోపాధి పొందుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని 25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు సబ్బులను తయారు చేస్తున్నారు. విటమిన్ ఏ, ఈలు, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ మేక పాలు.. చర్మ వ్యాధులను నయం చేస్తాయని శివార్ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్ హెగనా తెలిపారు. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు తాము రూ.300 చెల్లిస్తామని, ప్రతిరోజు పని చేసినందుకు గాను వారు రూ.150 సంపాదిస్తారని ఆయన పేర్కొన్నారు. 1,400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు చెప్పారు. -
ఎన్నికల ప్రచారంలో ఎంపీపై కత్తితో దాడి
ఉస్మానాబాద్(మహారాష్ట్ర) : ఎన్నికల ప్రచారంలో ఉన్న శివసేన ఎంపీ ఓంరాజే నింబల్కర్పై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. అయితే కత్తి ఓంరాజే చేతికి తలగడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం ఉదయం ఉస్మానాబాద్ పరిధిలోని కలాంబ్ తాలుకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన అభ్యర్థి కైలాశ్ పాటిల్ తరఫున ఓంరాజే ప్రచారం చేపట్టారు. అయితే పడోలి నైగాన్ గ్రామంలో ఓంరాజే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పలువురు పార్టీ నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఎంపీపై కత్తితో దాడికి పాల్పడాడు. ఆ కత్తి ఎంపీ చేతికి ఉన్న వాచ్‌కు తగలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అనంతరం ఎంపీని.. శివసేన శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఓంరాజే తండ్రి పవన్‌రాజే నింబల్కర్ జూన్ 3, 2016 హత్యకు గురయ్యారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవే ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ కేసులో మాజీ ఎంపీ పాదమ్‌సిన్హా పాటిల్ కీలక నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుండగా.. ఫలితాలు 24న వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఉస్మానాబాద్‌లో తొక్కిసలాట: భక్తుడు మృతి
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు శనివారం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా దేవాలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో తీవ్ర తొక్కిలసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకరు మరణించారు. ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దేవాలయ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నవరాత్రుల సందర్భంగా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన అధికారులు, సిబ్బంది సరైన చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.