ముంబై: బీజేపీ అధికారంలో ఉన్న చోట పురాతన నగరాల పేర్ల మార్పు చేపట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పట్టణాల, నగరాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో రెండు ప్రముఖ నగరాల పేర్లను మార్చబోతోంది. అందుకు కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధృవీకరించారు.
ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని ఏళ్లుగా ఈ డిమాండ్ నడుస్తోంది.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది.
చదవండి: మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్ దాడిలో..
Comments
Please login to add a commentAdd a comment