ముంబై: మహారాష్ట్రలో అనేక నదులు ప్రవహిస్తున్నా.. ఈ కరువు ఎందుకని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని.. పేదలు మరింత పేదరికంలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్ సోమవారం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కేసీఆర్ సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్, అకోలాలో నీటి ఎద్దడి ఉందన్నారు. అదే తెలంగాణలో నీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి పట్టదా?
‘మన దేశంలో ఏం జరుగుతుందో అర్థకావడం లేదు. ప్రస్తుతం మన దేశం ముందున్న లక్ష్యం ఏమిటి?. నేను చెప్పే విషయాలను ఇక్కడే మర్చిపోకుండా.. మీ గ్రామాలకు, బస్తీలకు వెళ్లి చర్చించండి. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎంత త్వరగా మనం మేలుకుంటే అంత త్వరగా బాగుపడతా. 13 నెలలపాటు ఢిల్లీలో రైతులు నిరసన చేయాల్సి వచ్చింది. 770 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పట్టదా?. వ్యవసాయ చట్టాలు రద్దు అంటూ ప్రధాని క్షమాపణలు చెప్పాక పరిస్థితి మారిందా?.
భయపడేది లేదు..
నీరు, కరెంట్ సమస్యల్ని కూడా కేంద్రం పరిష్కరించలేకపోయింది. నీటి ఎద్దడి పరిష్కారానికి నెహ్రూ హయాంలో కొంత ప్లానింగ్ జరిగింది. మనదేశంలో మార్పు రావాల్సిందే. ఎంతమంది ప్రధానులు మారినా, మన కష్టాలు మాత్రం పోలేదు. దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్‌ఎస్ వచ్చింది. కులం, మతం ప్రాతిపదికన బీఆర్‌ఎస్ ఏర్పడలేదు. కొత్త పార్టీ వస్తే దానిపై ఎన్నో అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, మేము భయపడేది లేదు. నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పర్మినెంట్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?
Comments
Please login to add a commentAdd a comment