ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సమంత.. ఫోటోలు వైరల్! | Heroine Samantha Special Pooja At Isha Foundation On Navratri Special | Sakshi
Sakshi News home page

Samantha: నవరాత్రి ప్రత్యేక పూజల్లో సమంత.. ఫోటోలు వైరల్!

Oct 4 2024 4:02 PM | Updated on Oct 4 2024 4:50 PM

Heroine Samantha Special Pooja At Isha Foundation On Navratri Special

టాలీవుడ్ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో పయనిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. బాలీవుడ్‌లో సిటాడెల్‌ ఇండియన్ వర్షన్‌ హనీ బన్నీలో కనిపించనుంది. ఇందులో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసిన సమంత మరోసారి అమ్మవారికి పూజలు నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో నవరాత్రుల సందర్భంగా పూజలో పాల్గొంది. దేవి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.

కాగా.. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో సమంత పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌ హీరో నాగచైతన్య- సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నాగార్జునపై మంత్రిపై పరువునష్టం దావా దాఖలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement