
అమ్మవారి అలంకరణ రోజుకొక హంగుగా దర్శనమిస్తుంది. అమ్మవారి రూపంగా భావించే మహిళలూ ఈ వేడుకల్లో తమ ఆహార్యమూ అదిరిపోవాలనుకుంటారు. దాండియా ఆటపాటల్లో పాల్గొనడానికి ప్రతిరోజూ ప్రత్యేకమైన దుస్తుల ఎంపిక తప్పనిసరి అనుకుంటారు.
అయితే, డ్రెస్ ఎంపిక కుదరడం లేదు అనుకున్నవారికి మనవైన కలంకారీ ప్రింట్లు ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నిరకాల చీర కట్టుకు సరైన ఎంపిక అవుతుంది. రూపాన్ని కళగా మార్చేస్తుంది.
ప్లెయిన్, ప్రింటెడ్, పట్టు శారీ
ఏ మెటీరియల్ అయినా.. రంగులు భిన్నమైనా.. ఒక్క కలంకారీ బ్లౌజ్ తీరైన కళను తీసుకువస్తుంది. దీనికి సిల్వర్ జ్యువెలరీ సరైన ఎంపిక అవుతుంది. సాధారణ మోడల్ లేదా మోడర్న్ కట్, లాంగ్ జాకెట్ అయినా.. డిజైన్ల ఎంపికలో కలంకారీకి సాటి లేదన్నది ఈ వేడుకలో కనిపిస్తుంటుంది. కళగా ఉండాలనుకునేవారు కలంకారీ ధరిస్తే చాలు నవరాత్రుల్లో నవ్యంగా వెలిగిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment