అద్దమే ఆభరణం: నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగేందుకు! ధర వంద నుంచి.. | Fashion: Mirror Based Thread Jewellery For This Navratri Special Look | Sakshi
Sakshi News home page

Fashion: అద్దమే ఆభరణం: నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగేందుకు! ధర వంద నుంచి మొదలు!

Sep 23 2022 11:45 AM | Updated on Sep 23 2022 12:04 PM

Fashion: Mirror Based Thread Jewellery For This Navratri Special Look - Sakshi

Navratri Special Jewellery: దాండియా నృత్యాల్లో మెరుపులు.. దారపు పోగుల అల్లికలో రంగుల హంగులు.. గోటాపట్టీ బ్యాంగిల్స్‌లో అద్దాలు అమరికలు.. వెండితీగల జిలుగుల్లో వెన్నెల చంద్రికలు .. నవరాత్రుల్లో అలంకరణకు ప్రత్యేకంగా నిలిచే ఆభరణాల మాలికలివి..



నవరాత్రి రోజులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. అలాగే, అతివలు కూడా అంతే అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఎరుపు, పసుపు, పచ్చలతో కాంతిమంతంగా ఉండే రంగు దుస్తులను ఎంచుకుంటారు.

వీటితో పాటు అందరిలో వేడకకు తగినట్టుగా ప్రత్యేకంగా కనిపించాలంటే ఎంపిక చేసుకునే ఆభరణాల్లో స్పెషాలిటీ ఉండాలి. నవరాత్రుల్లో వైవిధ్యంగా వెలిగిపోవడానికి అద్దాలతో అమర్చిన థ్రెడ్‌ బ్యాంగిల్స్, సిల్వర్‌తో కూర్చిన ఆఫ్ఘనీ సెట్స్, గోటాపట్టీతో చేసిన మిర్రర్‌ వర్క్‌ ఆభరణాలు సరైన ఎంపిక జాబితాలో ఉన్నాయి.

వంద రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఆభరణాలను అన్ని వయసుల వారూ ధరించవచ్చు. అభిరుచిని బట్టి డిజైన్స్‌ ఎంపిక చేసుకోవచ్చు.

చదవండి: Sreeleela: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర 68 వేలు! స్పెషాలిటీ ఏమిటి? 
Evening Sandals: ఈవెనింగ్‌ శాండల్స్‌.. నడకలో రాజసం.. పార్టీవేర్‌ ఫుట్‌వేర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement