4గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు | High demand for Navratri tickets | Sakshi
Sakshi News home page

4గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

Published Thu, Oct 1 2015 6:41 PM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM

4గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు - Sakshi

4గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గగుడిలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది రూ. 1000 పలికిన టికెట్ ధర ఈ ఏడాది రూ. 3000కు చేరుకుంది. అయినా భక్తుల స్పందన ఏమాత్రం తగ్గలేదు. దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అలంకారాల రోజుల్లో కుంకుమార్చన పూజలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు.

 ప్రత్యేక పూజల కోసం ఆలయ కమిటీ జారీ చేసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టికెట్ల అమ్మకం ప్రారంభించిన నాలుగు గంటల లోపే నాలుగు రోజుల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూలా నక్షత్రం రోజు టికెట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు అయిపోయాయని అధికారులు చెబుతుండటంతో సాధారణ యాత్రికులు విస్మయం చెందుతున్నారు. ఉన్న టిక్కెట్లన్నీ ఆలయానికి చెందిన వారు, వివిధ శాఖల అధికారులు సిఫార్సు చేయించిన వారికే ఆలయ సిబ్బంది విక్రయించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement