‘నువ్వు జంధ్యం ధరిస్తావా.. నీ గోత్రమేంటి..?’ | BJP Asks Rahul Gandhi What Is Your Gotra | Sakshi
Sakshi News home page

‘నువ్వు జంధ్యం ధరిస్తావా.. నీ గోత్రమేంటి..?’

Published Mon, Oct 29 2018 6:31 PM | Last Updated on Mon, Oct 29 2018 7:56 PM

BJP Asks Rahul Gandhi What Is Your Gotra - Sakshi

మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర (ఫైల్‌ ఫోటో)

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ ‘మీరు జంధ్యం ధరించారా.. ధరిస్తే అది ఎలాంటిది.. మీ గోత్రమేంటి’ అంటూ రాహల్‌ని ప్రశ్నించారు. అయితే రాహుల్‌ ఆలయాలను సందర్శించడం ఇదే​ ప్రథమం కాదు.

గతంలో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ రాహుల్ సోమ్‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌ తాను శివ భ‌క్తుడిని అని చెప్పుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement