మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గర్భగుడిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
बहुत दुखद खबर उज्जैन के महाकाल मंदिर में भस्म आरती के दौरान लगी आग, कई लोग झुलसे !
— Rajni (@RajniRajni2210) March 25, 2024
ईश्वर से सभी के सकुशल होने की कामना करते है !🙄😥🙏#होलिकोत्सव#Ujjain #MahakaleshwarTemple pic.twitter.com/YuuEvpLYHm
వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్, మనోజ్, సేవాధారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఆలయ పూజారి ఆశిష్ గురు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment