
ఉజ్జయిని(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ నేడు ఉజ్జయినిలో పర్యటించారు. ఈ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా ప్రియాంక పూజలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు.
అనంతరం ఉజ్జయినిలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉజ్జయిని లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబులాల్ మాలవ్యా బరిలో నిలిపింది. ఏడో విడతలో భాగంగా మే 19న ఉజ్జయినిలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment