భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు.
‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్‌లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment