భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని చౌహాన్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణం మిస్టరీగా మారింది. ఈ కేసులో సాక్షులు, నిందితులు దాదాపు 48 మంది అనుమానస్పద స్థితిలో చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీబీఐ విచారణకు మొదట్లో నిరాకరించిన మధ్యప్రదేశ్ సీఎం చివరకు అంగీకరించారు.
'వ్యాపమ్'పై సీబీఐ విచారణకు సిఫారసు
Published Tue, Jul 7 2015 1:40 PM | Last Updated on Mon, Oct 8 2018 3:31 PM
Advertisement
Advertisement