మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకోగా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకోగా.. బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాతో పాటు మరో రెండు స్థానాల్లో మాత్రమే కమలం గెలిచింది. ఈ విజయంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. భోపాల్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిందని.. ప్రజలకు మళ్లీ కాంగ్రెస్‌పై నమ్మకం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.